మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఇల్లంతకుంట,(ప్రభ న్యూస్ ):మండలంలోని గాలి పల్లి గ్రామానికి చెందిన బుర్ర చంద్రమౌళి  గౌడ్ 56 ఈనెల 6వ తేదీన మృతి చెందగా అతని కుటుంబాన్ని అదే గ్రామానికి చెందిన అయ్యన్న గారి హరికృష్ణ రెడ్డి పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాడు, ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ  చంద్రమౌళి గతంలో బతుకుదెరువు కొరకు దుబాయ్ వెళ్ళాడు,5 సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి మామూలు స్థితికి  రాగా మండలంలోని అన్నపూర్ణ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఓబులాపూర్ గ్రామం వద్ద ప్రాజెక్టులో కొన్ని రోజులు పనిచేసినప్పుడు యాక్సిడెంట్ జరిగి చేతి విరగడంతో ఇంటి దగ్గరనే ఉంటుండగా విధి వక్రీకరించి గుండెపోటుతో బుధవారం మరణించాడు, హరికృష్ణ రెడ్డి  గాలి పల్లి పాఠశాలలో జనవరి 26 సందర్భంగా  నిర్వహించిన   క్రీడా పోటీలలో  గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల కోసం 6000 రూపాయలు, ఇటీవల గాలి పల్లి గ్రామంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా పోటీలకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సుధాగోని  సంతోషం , బుర్ర కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

.