తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ఆదేశాల మేరకు నియోజకవర్గానికి చెందిన అన్ని విభాగాల అధికారులు పలువురు మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాయకులు రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మత పెద్దలు రంజాన్ పండుగ పురస్కరించుకొని కల్పించవలసిన సదుపాయాలను అధికారుల దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన అధికారులు ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ప్రార్థన మందిరాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీధిదీపాలు, త్రాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మత్తులు, పారిశుద్ధ్యం వంటి పనులు పూర్తిచేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, మత పెద్దలు, మైనార్టీ సోదరులు, టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.