తెలంగాణ ప్రభ (కోరుట్ల): జాతీయ స్థాయిలో సామాజిక ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్న జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాసంఘాల జేఏసీ,అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ కు గౌరవ డాక్టరేట్ అవార్డు వరించింది.
గత ముప్పై రెండు సంవత్సరాల క్రితం అప్పటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ గా ప్రారంభమైన ప్రస్థానం అక్షర జ్ఞానమే ఆయుధమంటు ప్రజాదండోర పత్రిక సంపాదకులుగా, సామాజిక, ప్రజా ఉద్యమాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో సైతం ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ గా క్రియశీలకంగా వ్యవరించారు. స్థానికంగా కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ జాతీయ స్థాయిలో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నందుకు గాను సోషల్ సర్వీస్ కేటాగిరిలో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి ఈ డాక్టరేట్ అవార్డుకు ఎంపిక చేశారు. యూనివర్సిటీ కో-ఆర్డినెటర్ స్పూర్తి సర్వీసెస్ సోసైటీ ఇండియా ఎన్జీవో చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఆద్వర్యంలో ఈనెల 24న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోగల సిటీ కల్చర్ ఆడిటోరియంలో అతిరథమహారధుల సమక్షంలో ఈ అవార్డు ప్రధానం చేయనున్నారని పేట భాస్కర్ తెలిపారు.
.