రోడ్డు ప్రమాదాల నివారణకే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష
గడిచిన నెల రోజులో మద్యం సేవించి వాహనలు నడిపిన 956 మంది పై కేస్ లు నమోదు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): గడిచిన నెల రోజులో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 956 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగిందని ఇందులో 233 మంది వ్యక్తులకు కోర్టు ద్వారా 1.98.400/- రూపాయల జరిమానలు విధించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణం అయితే సెక్షన్ 304-II కేసులు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లా లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు , ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.
అలాగే మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లిదండ్రులకు బాధ్యత వహించాలని ఎస్పీ హెచ్చరించారు.
వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని ఆయన కోరారు.
.