వాస్తవాలు త్వరలోనే తెలుసుకుంటారు : కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల): కొందరు  స్వార్థంతో అననీ మాటలను అన్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను అనని మాటల్ని అన్నట్టుగా ప్రచారం చేయడం వల్ల మనోభావాలు గాయపడి ఉంటే ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. వాస్తవాలను త్వరలోనే గ్రహిస్తారని అన్నారు. సామాజిక విలువలతో కూడిన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చానని ఒకరిని బాధపెట్టి పని ఎప్పుడూ చేయలేదని అన్నారు.సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సూర దేవరాజు, యేల్లే లక్ష్మీనారాయణ, గోలి వెంకటరమణ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, వెలుమల స్వరూప, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, బైరినేని రాము పలువురు నాయకులు పాల్గొన్నారు.

.