ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రియాంక
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూకట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్,తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకుడు షాజహాన్ షేక్ ను ఉరి తీసిన తప్పులేదని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రియాంక అన్నారు. తృణముల్ కాంగ్రెస్ నేత ఆకృత్యాలకు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ప్రియాంక మాట్లాడుతూ దేశం అంతా చర్చ జరగుతున్న ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని సందేశ్ ఖాళీ ప్రాంతానికి సంబంధించిన గిరిజన ప్రజల పై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ చేస్తున్నటువంటి దాడులు,మహిళలను తమ స్వంత పార్టీ కార్యాలయల్లో లైంగిక వేధింపులు, హత్యచారలకు గురి చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఇప్పటికీ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటన పై స్పందించకపోవడం స్పందించకపోవడంపై మండిపడ్డారు.
మమత బెనర్జీ కూడా ఒక మహిళ నే కదా ఇంకో క మహిళ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్ షేక్ ను వెంటనే కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మృత్యుంజయ చింతల్ నగర సంయుక్త కార్యదర్శి గౌతమ్, లక్ష్మీ శ్రీ, హేమ, సాయి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు
.