తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్ లో గల పురానిపేట్ పాఠశాలలో సోమవారం సాయంత్రం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవతో ONGC ద్వారా CSR కార్యక్రమం కింద ఐఐటి కాన్పూర్ వారిచే అభివృద్ధి చేయబడ్డ ఎడ్యుకేషనల్ డెస్కులతో కూడిన స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ONGC ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ను ఉపయోగించి ఐఐటి కాన్పూర్ వారిచే అభివృద్ధి చేయబడ్డ ఎడ్యుకేషనల్ డెస్కులతో కూడిన స్కూల్ బ్యాగులను నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు బ్యాగ్ కం స్టడీ టేబుల్ ని ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ తీసుకొని నిరుపేద విద్యార్థులకు అందించడం జరుగుతుంది
ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, పట్టణ యువమోర్చా అధ్యక్షులు వినీత్ గౌడ్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత, పట్టణ ఉపాధ్యక్షుడు గాధాస్ రాజేందర్, మల్లీశ్వరి భానుప్రియ,కవిత, పులి శ్రీధర్, ప్రశాంత్, బోగ రాజు, బడే శంకర్, రాజగోపాల్, శ్రావణ్, మరియు స్కూల్ ఉపాధ్యాయులు మరియు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
.