పేదింటి బిడ్డకు పెద్ద గౌరవం......

ప్రభుత్వం చేతుల మీదుగా నియామకం.....

గురుకుల ఉపాధ్యాయురాలిగా జోగు నిర్మల.......

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): పేదింటి బిడ్డకు పెద్ద గౌరవం సంతరించుకుంది,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గురుకుల నియామకాలలో ఆమె పడిన కష్టం విజయాన్ని వరించింది.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపే దిశగా చేపట్టిన గురుకుల నియామకాలలో టిజిటి తెలుగు ఉపాధ్యాయురాలిగా,మేడ్చెల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టకు చెందిన జోగు నిర్మల భర్త వెంకట నరసయ్యతన ప్రతిభను మెచ్చిన ప్రభుత్వం, సోమవారం ఎల్బీ స్టేడియంలో జోగు నిర్మలకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నా భర్త సహకారంతోనే ఇంతటి స్థాయికి వచ్చానని ప్రతి ఒక్కరు చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆమె అన్నారు

.