ప్రజావాణికి 70 పిర్యాధులు

ప్రజావాణికి వచ్చే అర్జీలను  పూర్తిగా పరిశీలించి పరిష్కరించాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  

తెలంగాణ ప్రభ ( సంగారెడ్డి ): సంగారెడ్డి జిల్లా నలుమూలల నుండి  తరలివచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఫిర్యాదులను  స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సోమవారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి 70 పిర్యాధులు  అందాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అన్నారు. రెవిన్యూ శాఖకు సంబంధించిన పిర్యాదులు 20 , వివిధ శాఖలకు సంబంధించిన 50 దరఖాస్తులు అందాయని  జిల్లా కలెక్టర్  తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలకు కావలసిన అర్హతలను బట్టి వారికి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

.