తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని నూతనంగా నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ దేవాలయా పరిసర ప్రాంతంలో మండెపల్లి గ్రామ బండి వారి కుల సంఘం ఆధ్వర్యంలో మైలారం మల్లన్న దేవాలయాన్ని నిర్మించడానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైలారం మల్లన్న కు గ్రామంలోని అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో మైలారం మల్లన్న దేవుణ్ణి గ్రామంలో నిర్మించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మల్లయ్య, చంద్రయ్య,పర్శయ్య, బక్కయ్య,అంజయ్య, బాలయ్య,మల్లయ్యలు తదితరులు పాల్గొన్నారు.
