అనారోగ్య కారణంగా ఉరివేసుకొని యువకుడి మృతి

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); అనారోగ్య కారణంగా ఉరివేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా అంబారీపేటకి చెందిన గుండం రామయ్య పెద్ద కుమారుడు గుండం రాజు (32) అనునతడు 3 సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అనంతరం రెండు సంవత్సరాల క్రితం మృతుడు ఉపాధి కొరకు గల్ఫ్ వెళ్లి అనారోగ్య కారణంగా 7 నెలల క్రితం తిరిగి వచ్చాడు. తాను అనారోగ్య సమస్యతో ఏ పని చేయడం లేదని తనకు తానే బాధపడి తీవ్ర మనస్తాపంతో జీవితం మీద విరక్తి చెంది ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుని తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు.

.