ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 282 జయంతి ఉత్సవాలు

ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కుత్బుల్లాపూర్ అధ్యక్షులు రమేష్ నాయక్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గిరిజన బిడ్డల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయం అని ఆల్ ఇండియా బంజారా సంగం కుత్బుల్లాపూర్ అధ్యక్షులు రమేష్ నాయక్ అన్నారు శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి సందర్భంగా గాజులరామారం డివిజన్ దేవేందర్ నగర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా రమేష్ నాయక్ మాట్లాడుతూ శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన సేవలను ఆయన జీవిత విధానాన్ని మనమందరము అవలంబించుకొని ఆయన మార్గంలో ముందుకు పోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.