తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అయ్యప్ప స్వామిజ్ఞాన సరస్వతి మాత, కోటి నవ దుర్గ దేవాలయాలలో వసంత పంచమి వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు.
అలాగే సరస్వతి మాత దేవాలయంలో సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి అభిషేకలు నిర్వహించి విద్యార్థులకు కంకణ దారుణ, పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టాటా గ్లోబల్ బేవరేజ్ కంపెనీ ఆధ్వర్యంలోటాటా గ్లూకోప్లస్ ఎనర్జీ డ్రింక్ ను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
.