కుటుంబ సమేతంగా పాల్గొన్న కార్పొరేటర్ కొలుపుల జగన్
గోవింద నామస్మరంతో మారుమోగిన జగద్గిరిగుట్ట ఆలయ ప్రాంగణం
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 53వ బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో జగద్గిరిగుట్ట డివిజన్ కార్పోరేటర్ కొలుకుల జగన్ కుటుంబ సమేతంగా పాల్గొని అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవార్ల అలంకరణకు కార్పోరేటర్ జగన్ 1 .50 కీలోల వెండిని ఆలయ ఈవో కు విరాళంగా అందజేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా కార్పొరేటర్ కొలుపుల జగన్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని జగద్గిరిగుట్ట డివిజన్ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆయురారోగ్యాలు కలిగించాలని వేడుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వేణు యాదవ్ బండి సీనియర్ నాయకులు కృష్ణ గౌడ్ సత్యనారాయణ, లక్ష్మీ, కొలుకుల శశికళ జగన్, యూత్ నాయకులు కొలుకుల జైహింద్, జ్యోతి, శివాని, సాయి, కార్తిక్, కీర్తి, బండ మహేందర్ , ఇందిరాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
