- పెండ్లి బస్సును ఢీ కొన్న లారీ
- క్షతగాత్రులకు అన్ని విధాలుగా ఆదుకుంటా
- ఫోన్ లో పరామర్శించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
తెలంగాణ ప్రభ ( మెదక్ ): మెదక్ నియోజకవర్గంలోని నిజాంపేట మండల శివారులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో సిద్దిపేట నుండి మెదక్ కు వస్తున్న పెండ్లి బృందం బస్ ను మెదక్ నుండి సిద్దిపేటకు వెళ్తున్న లారీ ఢీ కొట్టడంతో బస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్ళడంతో క్షతగాత్రులను ఫోన్ లో పరామర్శించారు. వెంటనే సిద్దిపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ తో ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలందించాలని పేర్కోన్నారు. అవసరమైతే హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించాలని పేర్కోన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఫోన్ లో మాట్లాడి హామినిచ్చారు.
