వైద్య విద్యార్థులు మంచి డాక్టర్లుగా ఎదిగి ప్రజలకు సేవలు అందించాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో ): వైద్య వృత్తి అత్యంత ఉన్నతమైనదని, విద్యార్థులు సబ్జెక్ట్ పై పూర్తి అవగాహన కలిగేలా బాగా కష్టపడి చదివి, నైపుణ్యం గల డాక్టర్లుగా ఎదిగి ప్రజలకు సేవలు అందించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వైద్య విద్యార్థులకు
ఉద్భోధించారు. మంగళవారం కలెక్టర్ సంగారెడ్డి మెడికల్ కళాశాల పనుల పురోగతిని, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి పరిశీలించారు.
మెడికల్ కళాశాల రెండో బ్లాక్ లో నిర్మాణంలో ఉన్న కొత్త హాస్టల్ భవనాలు, పరిపాలన భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయా భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి స్వాధీనం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, ఆర్అండ్ బి అధికారులకు సూచించారు. అదేవిధంగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కాంపౌండ్ వాల్ పూర్తి చేయాలని చెప్పారు. డాక్టర్ వృత్తి గౌరవ ప్రదమైనదని, విద్యార్థులకు సబ్జెక్టుపై పూర్తి నాలెడ్జ్ ఉన్నప్పుడే, రాబోయే రోజుల్లో డాక్టరుగా రోగుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించ
గలుగుతారని, అందుకు బాగా చదివి,మంచి డాక్టర్లుగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి ఆస్పత్రి మొత్తం కలియ తిరిగి పరిశీలించారు.
అనంతరం ఆసుపత్రికి ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్ అవసరం ఉన్నట్లయితే ఆయా వివరాలతో ప్రతిపాదనలను అందించినట్లయితే మంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని కలెక్టర్ ఆసుపత్రి సూపర్డెంట్ కు సూచించారు. కలెక్టర్ వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, ఆర్అండ్ బి అధికారులు, తహశీల్దార్ ఉన్నారు
.