కన్నుల పండుగగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ గోదా రంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేపట్టారు ఇట్టి కల్యాణంలో భక్తుల కోలాటాలు చిన్నారుల నృత్యం వెంకటేశ్వర భజన మండలి వారిచే భజనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇట్టి కార్యక్రమాలు ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నర్సింహాచారి వైదిక నిర్వహణలో నిర్వహించారు అనంతరం భక్తుల సౌకర్యం కోసం అన్నప్రసాదం ఏర్పాటు చేశారు 

ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల ఆలయ ఈవో ఎం విక్రమ్ జూనియర్ అసిస్టెంట్ పెడిపల్లి నర్సయ్య కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి నాయకులు మ్యాకల నరసయ్య పుప్పాల ప్రభాకర్ ఆండాళ్ గోస్ట్ బృందం సభ్యులు వెంకటేశ్వర భజన మండలి సభ్యులు భక్తులు మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

.