తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని రేగుంట వేంపల్లిగ్రామాల మధ్య ఉన్నటువంటి పొర్లకుంట చెరువును ఆదివారం రోజు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఈ చెరువును పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ ల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ పొర్లకుంట చెరువు అని జువ్వాడి కృష్ణారావు అన్నారు చిన్న మత్తడి నిర్మించడం ద్వారా ఈ చెరువుని పూర్తిగా ఉపయోగంలోకి తేవాచ్చు అని ఇది రెండు గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందని ఇందుకోసం తాను సంబంధిత మంత్రి ముఖ్యమంత్రులను కలిసి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని జువ్వాడి కృష్ణారావు అన్నారు
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక ఎంపిటిసి సభ్యుడు గడ్డం శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ మిట్టపల్లి జలపతి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజోజు సదానంద చారి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి మల్లాపూర్ మండల యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పోతు శేఖర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు నానం రాకేష్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గంగారెడ్డి జలంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
.