
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని కేసిఆర్ నగర్ కు చెందిన ఒగ్గు సాయిలు (51 )అనే టైలరింగ్ కార్మికుడు పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే పని ముగించుకొని సైకిల్ పై ఇంటికి వెళుతున్న క్రమంలో ముస్తాబాద్ నుండి వస్తున్న AP15Z0082 నెంబర్ గల ఆర్టీసీ బస్సు తంగళ్ళపల్లి శివారులో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ తరలించారు.
మృతునికి భార్య, కూతురు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని స్థానిక నాయకులు కోరారు.
.