నిధుల దుర్వినియోగం చేసినందున ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

తెలంగాణ ప్రభ  ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ  అధ్వర్యంలో నడుస్తున్న MLS     పాయింట్ లో నిధుల దుర్వినియోగం చేసినందున  ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్ చేసినట్లు అదనపు కలెక్టర్లు వేంకటేశ్వర్లు (రెవెన్యూ) తెలిపారు. 

మెదక్ మండలంలోని ఎంఎల్ఎస్ కేంద్రంలో బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగాయని, దాదాపు 5,85,67,880 రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందని, ఎం.ఎల్.ఎస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న B.నర్సింహులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్న చిన్నగల్ల శ్రీనివాస్ లను సస్పెండ్ చేసి, వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేశామని అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ( రెవెన్యూ)తెలిపారు.

.