నిత్యాన్నదానం, అల్పాహారంకు విరాళం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో, అయ్యప్ప మాల ధారణ స్వాములకు మండల కాలం(41 రోజులు) పాటు నిత్య అన్నదాన, అల్పాహారం కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి, అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు.
అనంతరం నిత్యాన్నదాన మరియు నిత్య అల్పాహార సంబంధిత రుసుమును నిర్వాహకులకు ఎమ్మెల్సీ అందజేశారు. అందరు అయ్యప్ప స్వాములకు దక్షిణ అందజేసి పాదాభివందనం చేశారు. ఆలయ కమిటీ నాయకులు, నిర్వాహకులు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీతో పాటు సర్పంచులు దేవాగౌడ్, మహిపాల్ రెడ్డి, యామిరెడ్డి, సాయాగౌడ్, శ్రీను నాయక్, ఎంపీటీసీ సిద్దిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ పురం వెంకట నారాయణ,
ఏఎంసీ డైరెక్టర్ కొండా శ్రీను తదితరులు ఉన్నారు.
.