మద్యం, డబ్బుల సరఫరాకు కాదు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్య శ్రీ చేయూత పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాధిత రోగుల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్సులను ఎన్నికలలో డబ్బులు, మద్యం సరఫరా కోసం కాకుండా ప్రజల రవాణా కోసం వాడాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు పథకాల్లో భాగంగా శనివారం మెదక్ లో ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా వైద్యాధికారి చందు నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ సౌకర్యానైనా ప్రజల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు. ప్రజలకు సహాయపడే విధంగా అధికారులు వ్యవహరించాలని సూచించారు. తమ కుటుంబం ప్రజల కోసం ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తామని తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పోస్టర్లను జిల్లా కలెక్టర్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను ఎమ్మెల్యే రోహిత్ రావు జెండా ఊపి ప్రారంభించారు. బస్సులలో ఎక్కిన మహిళలకు ఉచిత టికెట్లను అందజేశారు. కలెక్టర్, ఎమ్మెల్యే కలిసి కొద్దిదూరం ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధి కారి చందు నాయక్, డిసిహెచ్ చంద్రశేఖర్, వైద్యాధికారులు ఎ.చంద్రశేఖర్, నవీన్, చంద్రశేఖర్, జిల్లా రవాణా అధికారి జాహ్నవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రావు, బొజ్జ పవన్, హాఫీస్ మొల్సాబ్, సురేందర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, నాగిరెడ్డి, మంగమోహన్ గౌడ్, గూడూరి అరవింద్, పాల్గొన్నారు.
.