తనిఖీలలో జప్తు చేసిన 5,27,42,852/- రూపాయల్లో, 3,44,22,338/- రూపాయలు విడుదల....

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): ఎన్నికల తనిఖీలలో భాగంగా జిల్లాలో 173 కేసులలో జప్తు చేసిన 5,27,42,852 రూపాయల్లో, 162 కేసులకు సంబంధించి 3,44,22,338/- రూపాయలు విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోనీ ఐదు నియోజక వర్గాలలో జప్తు చేసిన 5,27,42,852 రూపాయలలో, సంబంధిత వ్యక్తులు సమర్పించిన ఆధారాలను తనిఖీ చేసి, జిల్లా గ్రీవెన్స్ కమిటి ద్వారా 

రూ. 3,44,22,338/- లు విడుదల చేసినట్లు తెలిపారు. 

నారాయణఖేడ్ నియోజకవర్గంలో 45 కేసులలో జప్తు చేసిన రూ.86,53,810/- లు మొత్తం విడుదల చేసినట్లు తెలిపారు.

ఆందోల్ నియోజకవర్గంలో 12 కేసులలో 19,80,020/- లు జప్తు చేయగా, 11 మందికి 18,50,020/- లు విడుదల చేసామని, జహీరాబాద్ నియోజకవర్గం లో 41 కేసులలో 1,45,23,430/- లు జప్తు చేయగా, 39 కేసులకు సంబంధించి 97,97,430/- లు విడుదల చేసినట్లు తెలిపారు.

సంగారెడ్డి నియోజకవర్గంలో 29 కేసులలో జప్తు చేసిన రూ.56,15,988/- లలో  27 మందికి 54,65,488/- లు విడుదల చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

పటాన్చెరు నియోజకవర్గంలో 46 కేసులలో రూ. 2,19,69,604/-  జప్తు చేయగా,40 కేసులకు సంబంధించి రూ. 86,55,590/- లు విడుదల చేసినట్లు తెలిపారు.

11 కేసులకు సంబంధించి సరైన ఆధారాలు సమర్పించనందున 1,83,20,514/-  రూపాయల నగదు విడుదల చేయలేదని కలెక్టర్ తెలిపారు.

సంబంధితులు సరి అయిన ఆధారాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీలో సమర్పించి నగదును విడుదల చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

.