జిల్లా సాధారణ పరిశీలకులు పృధ్వీ రాజ్ బీపీ ఐఏఎస్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సాధారణ ఎన్నికలు 2023, గత నెల నవంబర్ 30-12-2023 గురువారం జరిగిన పోలింగ్ పూర్తి అయ్యింది. పోలింగ్ పూర్తి సరళి పై శుక్రవారం YPR కాలేజ్ లోని సెమినార్ హాల్ లో జిల్లాలో ని మెదక్ , నర్సాపూర్ నియోజక వర్గాలలోనీ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో,ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా సాధారణ పరిశీలకులు పృధ్వీ రాజ్ బీపీ ఐఏఎస్, మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అదనపు కలెక్టర్లు వేంకటేశ్వర్లుతో సమావేశంలో పాల్గొన్నారు.
సాధారణ పరిశీలకులు పృధ్వీ రాజ్ బీపీ ఐఏఎస్ మట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినదని, రాజకీయ పార్టీల నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ECI నిబంధనలు ప్రకారం ,పోలింగ్ లో ముఖ్యమైన పత్రాలు,మక్ పోలింగ్, EVM,VVPAT పై ,పోలింగ్ కేంద్రాల్లో జరిగిన పోలింగ్ పై స్క్రూటినీ నిర్వహించారు .పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల అధికారులకు రాజకీయ పార్టీల నాయకులు,ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో RO లు అంబదాస్ రాజేశ్వర్, శ్రీనివాస్, సెక్టార్ అధికారులు, అభ్యర్థులు, అభ్యర్ధుల ప్రతినిదులు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
.