
తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి ఎమ్మెల్యేగా దయచేసి ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం కల్పించాలని ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఓటర్లను ఓటు అభ్యర్థించారు. శుక్రవారం రోజున ధర్మపురి పట్టణంలోని పలు విధులలో కోరండ్లపల్లె నరసయ్యపల్లె, బుగ్గారం మండలంలోని వెలుగొండ చిన్నాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఒకసారి గెలిపించి అవకాశం కల్పించాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందజేస్తుందని పేదలకు 500 కు సిలిండర్ ను అందిస్తుందని తెలిపారు.నాలుగు సార్లు ఓడిన నిత్యం ప్రజల్లో వుంటూ ప్రజా సమస్యల పై పోరాటం చేశానని చెప్పారు. ఒక్కసారి గెలిపిస్తే ప్రజలు కోరుతున్న విదంగా పాలన చేస్తానని ధర్మపురి నియోజకవర్గము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం లో కేవలం వారి కార్యకర్తల లబ్ది జరిగింది. కొప్పుల ఈశ్వర్ కమిషన్ ల కోసం పనులు చేశారు తప్ప ధర్మపురి అభివృద్ధి కోసం పనిచేయలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరట పేదల ఇళ్లను కూల్చివేసి వారికి ఇబ్బందులు కలిపించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు చేశారు నిధులు తీసుకరాలేదని అన్నారు. దళిత బంధు పథకం వారి నాయకుల కు కార్యకర్తలకు ధనవంతులకు ఇప్పించారని అసలైన లబ్ధిదారులకు లబ్ది చేకూరలేదు.ఒక్కసారి అవకాశం కల్పించాలని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఓటర్లను కోరారు.
