బీజెపి నుంచి బీఆర్ఎస్ లో చేరిక

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ పట్టణానికి చెందిన బిజెపి నాయకులు  కృష్ణ తో పాటు 200 మంది శుక్రవారం బిఆర్ఎస్ లో చేరారు. వీరికి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,  ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  బి ఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి వివిధ పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.  మెదక్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిని  భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  మామిళ్ల ఆంజనేయులు, లక్ష్మీనారాయణ గౌడ్  బి ఆర్ ఎస్ నాయకులు రాగి అశోక్, నరేష్, బట్టి వేణు, చంద్రమోహన్ గౌడ్ పాల్గొన్నారు.

.