కేకేకు మద్దతుగా కాంగ్రెస్ లో చేరిన గౌడ యువకులు

తెలంగాణ ప్రభ )ఎల్లారెడ్డి పేట): సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కి మద్దతుగా ఎల్లారెడ్డి పేట గౌడ సంఘం యువకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి , జిల్లా కార్యదర్శి పసుల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ ల  సమక్షంలో పార్టీలో  చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గంట అంజాగౌడ్ ఆద్వర్యంలో  శుక్రవారం  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గౌడ యువకులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి విజయానికి సైనికులు లాగా పని చేయాలని గౌడ యువకులను కోరారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను  ప్రజలకు  ఓటర్లకు వివరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డి విజయానికి సైనికుల వలె అంకితభావంతో పనిచేస్తామని  తెలియజేశారు.పార్టీ లో చేరిన యువకులు

 పుల్లయ్య గారి బాల సాయి గౌడ్, పుల్లక్  వినీత్ గౌడ్, పుల్లక్  మహేష్ గౌడ్ , గంట శ్రీనివాస్ గౌడ్,  గంట సాయిరాం గౌడ్ , గంట ప్రశాంత్ గౌడ్, తుపాకుల అనిల్  గౌడ్  పాలకుర్తిరాజు గౌడ్,  ఘనగోని పర్శరాములు గౌడ్,  జాకీర్,  సన్నీ ,

నాగుల విక్రం గౌడ్,  పాలకుర్తి వేణు గౌడ్ తదితరులు చేరిన వారిలో ఉన్నారు.కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, మాజీ ఎంపీటీసీ నేవూరి రవీందర్ రెడ్డి, నాయకులు ముష్కం దత్తాద్రి గౌడ్, చెన్ని బాబు, గంట బుచ్చా గౌడ్, పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, నాయకులు పాల్గొన్నారు. కాగా మండలంలోని హరిదాస్ నగర్  కు  చెందిన చిర్రం నాగరాజు యాదవ్ ఆద్వర్యంలో  15 మంది యువకులు కే కే కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

.