బిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు కాంగ్రెస్ లో చేరిక

ముస్లిం మైనార్టీల మద్దతు మైనంపల్లి రోహిత్ రావుకే

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ పట్టణం 15వ వార్డుకు చెందిన టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు కైజర్ సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కైజర్ తో పాటు అదే వార్డుకు చెందిన బిఆర్ఎస్ యువజన కార్యదర్శి మహమ్మద్ ఆసిఫ్, సభ్యుడు ఎండి.ఇమ్రాన్ కాంగ్రెసులో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడలు భరించలేక ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గెలుపు కోసం మైనార్టీలు అంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

.