అభివృద్ధి పట్టని ఎమ్మెల్యే మనకు అవసరమా..? పద్మకు ఓటేస్తే మోసపోయినట్టే

పద్మకు ఓటేస్తే మోసపోయినట్టే

ఎమ్మెల్యే దంపతులకు అవినీతి తప్ప..సేవ చేయాలనే ఆలోచన లేదు

మెదక్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ రావు

తెలంగాణ ప్రభ  ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): పదేళ్లుగా అవినీతిలో కూరుకుపోయి ప్రజల సొమ్మును దోచుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి పద్మకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.  సోమవారం మెదక్ మండల పరిధిలోని మగ్దూంపూర్, సంగాయిగూడ, మంగళగుట్ట, జానకంపల్లి, చిట్యాల, మంబోజిపల్లి, మాచవరం, పేరూరు, ర్యాలమడుగు తదితర గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రావు మాట్లాడుతూ...పదేళ్లుగా తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో  ఎమ్మెల్యేగా పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపించుకుంటే కనీసం ప్రజల సమస్యల్ని పట్టించుకున్న పాపానాపోలేదని ఆరోపించారు.  ఎమ్మెల్యే దంపతులకు అవినీతి తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదని, అందులో భాగంగానే మెదక్‌ను దోచుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. మరోమారు బీఆర్‌ఎస్‌ను నమ్మి ఓట్లు వేస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మనుషులే పెత్తనం చెలాయించి సామాన్య ప్రజలను అణగదొక్కడం ఖాయమన్నారు. గతంలో మైనంపల్లి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో లోని ఆరు గ్యారంటీలను అమలును ఇంటింటికి తీసుకెళ్లి ప్రతిఒక్కరికి తెలియపర్చి బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడగొట్టడమే తమ లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద ప్రతి కింద ఏటా రైతు, కౌలు రైతులకు రూ. 15 వేలు తోపాటు వ్యవసాయ కూలీలకు రూ‌‌.12 వేలు, వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. అలాగే ఫించన్ రూ. 4 వేలు,  ఆడబిడ్డలందరికీ ప్రతి నెల 1వ తేదీన రూ. 2500 ఇస్తామని, మహిళలు ఉచితంగా ఆర్టీసి బస్సులలో ప్రయాణించవచ్చునని అన్నారు. కల్యాణలక్ష్మీ పథకంలో భాగం గా ఒక లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని, ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటిస్థలంతో పాటు ఐదు లక్షల రూపాయాలను ఇస్తామని, పిల్లల చదువులకు ఐదు లక్షల రూపాయాల బ్యాంకు గ్యారంటీ కార్డు ఇస్తామని అన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.  చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రోహిత్ కోరారు. ఈ కార్యక్రమంలో... సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీనివాస్ చౌదరి, మండల అధ్యక్షుడు శంకర్, యూత్ అధ్యక్షుడు రాజు,  బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు హఫీజ్, ఎంపీటీసీలు శ్రీహరి, ప్రభాకర్ సిద్దాగౌడ్, పేరూరు ఉప సర్పంచ్ జానకీ రాం రెడ్డి, మాజీ సర్పంచ్ ఆంజనేయులు, నాయకులు మహేష్ గౌడ్, మ్యాకల ఆంజనేయులు, శేషు కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు మురళీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

.