ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా చెరుకు రైతుల సమావేశం
ఈనెల 23న జహీరాబాద్ బంద్
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ విన్నపం
ఢిల్లీ వసంత్ నేతృత్వంలో ఉద్యమం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని చెరుకు రైతులు కర్మాగారం ఎదుట సోమవారం నాడు సమావేశమయ్యారు. చక్కెర కమిషనరేట్ తీసుకొచ్చిన దుర్మార్గమైన ఆదేశాలతో చెరుకు డైవర్షన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమయ్యారు, ఈరోజు కర్మాగార పరిధిలోని రైతులు పెద్ద ఎత్తున కర్మాగారం ఎదుట సమావేశమై ఉద్యమ కార్యచరణను ప్రకటించారు, స్థానిక నేతలు, జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యుల నిర్లక్ష్యంతో విసుకు చెందిన రైతులు ఈనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జహీరాబాద్ రాక సందర్భంగా బహిరంగ విన్నపం చేశారు. కర్మాగారాన్ని తెరిపించడం, బకాయిల చెల్లింపు, గిట్టుబాటు ధర, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ప్రకటన, రాష్ట్రస్థాయి అడ్వైజర్ కౌన్సిల్ ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, Xavier labor relation institute (XLRI) తో ఒప్పందం, సహకార రంగ అభివృద్ధికి సహకరించవలసిందిగా పలు డిమాండ్లు చేశారు.
మంగళవారం నాడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల రైతులతో మరో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలోని సామాజిక, వర్తక, వాణిజ్య, సంఘాలతో సమావేశమై వారి సహకారాన్ని కోరునున్నారు, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల మద్దతు - సహకారం కోరనున్నారు, సమస్య పరిష్కారం అయ్యేవరకు కర్మాగారం ఎదుట నిరవధిక బేటాయింపు చేయనున్నారు, మధ్యాహ్నం వంటావార్పుతో కర్మాగారం ఎదుట భోజనాలు కూడా చేశారు, ఈ సమావేశంలో ఢిల్లీ వసంత్, కొండల్ రెడ్డి, హుగెల్లి రాములు, నర్సింహారెడ్డి, మొగుడంపల్లి ఆశప్ప, జలాలుద్దీన్, జగన్నాథ్ రెడ్డి, తిప్పారెడ్డి, కార్మిక నేత జగదీష్, వెంకట్ రెడ్డి, దూలయ్య తదితరులు పాల్గొన్నారు.
.