సీఎం సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి దేశానికి దిక్సూచిలా సీఎం కేసీఆర్ మారాడని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరయ్యే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటల నాణ్యమైన కరెంటు కావాలంటే కెసిఆర్ కు కారకు ఓటేయాలని కోరారు. 11 విడుత లో 72 వేల కోట్ల రూపాయలు రైతులకు రైతుబంధు పథకం కింద వేశాడని తెలిపారు.
విద్యా వైద్యం సాంకేతిక రంగాల్లో అగ్రగా మీద ఉండి దేశానికే దిక్సూచిలా తెలంగాణ రాష్ట్రం మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లో చిత్తశుద్ధి నిజాయితీ లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో నాలుగేళ్ల పాలనలో 250 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని మన రాష్ట్రంలో ఆత్మహత్యల్లేని తెలంగాణ ముందుకు సాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే కరువు కాటకాలు కరెంట్ కష్టాలు వస్తాయని అన్నారు. వ్యవసాయం అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలియదని అవగాహన లేదని అన్నారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే అసైన్డ్ భూములకు పట్టా భూములు కల్పించి వారికి పూర్తి హక్కులు కల్పించమని తెలిపారు. రేషన్ షాపులలో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, పైడి శ్రీధర్ గుప్త, సంతోష్ రెడ్డి తోపాటు బీ ఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.