తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం కేసీఆర్ నగర్ లో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హారిక రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 40 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కామిని వనిత పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ సంగీత, భాగ్య గౌడ్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు.
