నామినేషన్ దాఖలు చేసిన మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా..
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బిఅర్ఎస్ అభ్యర్థి స్వగ్రామం కోనాపూర్ పోచమ్మ ఆలయంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మెదక్ రిటర్నింగ్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నామినేషన్ వేసినట్టు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తెలిపారు..
తెలంగాణ ఉద్యమ సమయంలో మెదక్ నియోజకవర్గం ప్రజలు నాకు చేదోడు వాదోడుగా నిలిచి ముందు ఉన్నారు అని పేర్కన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంచానని అన్నారు.
ఇక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి ఆశీస్సులతో జిల్లా హెడ్ క్వార్టర్ అయ్యింది అన్నారు. వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో సాగునీటి కోసం ఏం ఎన్ కెనాన్. ఎఫ్ ఎన్ కెనాల్ కు లైనింగ్ చేసి పంట పొలాలకు సాగునీరు అందించమన్నారు..
మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరుంచడం జరిగింది అన్నారు..
ఎన్నో ఏండ్ల నుంచి కలలాగానే మిగిలిపోతాయి అనుకున్నా కార్యక్రమాలను మెదక్ కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాo, రైల్వే, మెడికల్ కాలేజీనిఏడు సంవత్సరాలలో తీసుకొచ్చామన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ఆడబిడ్డ లాగా ఆశీర్వదిస్తూన్నారని ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన ఉందన్నారు .
మెదక్ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు...
పద్మా దేవేందర్ రెడ్డి తరఫున మరో నామినేషన్ సెట్ ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి మెదక్ రిటర్నింగ్ కార్యాలయంలో అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి. మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
.