కాంగ్రెస్ పార్టీలోకి మెదక్ మాజీ కౌన్సిలర్ చేరిక

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో): మెదక్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బట్టి సులోచన,కుమారుడు సాయి మోహన్,ప్రముఖ న్యాయవాది పవన్ శ్రీకర్ రావు 

మెదక్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కొండన్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి హన్మంతరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యే హన్మంతరావు  మాట్లాడుతూ బారస నాయకుల మాయ మాటలు నమ్మక అందరూ కాంగ్రెస్ పార్టీలో కి చేరుతున్నారని అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం మన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

.