ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు గా జెట్టి రాజన్న..

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గా జెట్టి రాజన్న ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ నా పై నమ్మకం తో అధ్యక్షుడు గా ఎన్నుకున్న కులబంధావులకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ కుల అభివృద్ధి కోసం ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టు కృష్ణ, ఆకుల రాజేష్, చొప్పరి శ్రీనివాస్, విరవేణి రాజమల్లయ్య,గాడిచెర్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

.