
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం సారం పెళ్లి గ్రామంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ గ్రామ సర్పంచ్ కోహెడ రమేష్ తో కలిసి ఆవిష్కరించారు. తదనంతరం గౌడ సంఘ కమ్యూనిటీ హాల్ను మంత్రి కేటీఆర్ గౌడ సంఘ అధ్యక్షుడు కోల బాలమల్లు తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నేను ఎప్పుడూ ఎన్నికలకు వచ్చినా సారం పెళ్లి గ్రామం నుండే ప్రారంభిస్తాను, ఇప్పుడు కూడా సారంపల్లి నుండి ఎన్నికలు ప్రచారం ప్రారంభించాను. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతుంది... 75 వేల కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఘనత సీఎం కేసిఆర్ దేనని, ఒకే రోజు 6000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీకి రైతుల ఖాతాలో వేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి బాట పట్టిందని ఆయన తెలియజేశారు. మీ దయతో నాలుగుసార్లు గెలిచినానని మళ్లీ కూడా మీ ఆశీర్వాదంతో ముందుకొస్తానని, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.
