మెడికల్ కాలేజి లో పలు సమస్యలపై చర్చ

తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్  మంగళవారం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశమయ్యారు.

గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు కల్పించాల్సిన మెరుగైన వసతుల కల్పన కోసం వారు చర్చించారు. రోగుల సహాయకులు కూర్చోడానికి కుర్చీలులేక ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి పూట ఆశ్రయంలేక అవస్థలు పడుతున్నారని, ఆసుపత్రి సమీపంలోని మార్చురీ గదిని మరో చోటికి తరలించాలని ఎమ్మెల్యే చందర్  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సహాయకులకు కుర్చీలు సమకూర్చాలని, ఎన్టిపిసి సీఎస్ఆర్ నిధులతో రాత్రిపూట ఆశ్రయం కోసం షెడ్, అల్పాహారం కోసం క్యాంటీన్, మెడికల్ కళాశాలలో ఇంటర్నల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. రామగుండం నియోజకవర్గంలో డియంఎఫ్టి నిధులతో నిర్వహించాల్సిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.

.