తెలంగాణ ప్రభ(ధర్మపురి): మాజీ మంత్రి పట్టభద్రుల ఎంఏల్సి జీవన్ రెడ్డి లాంటి పెద్ద నాయకుల ను విమర్శించి నంత మాత్రాన పెద్ద నాయకులు అవుతారా అని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్ విమర్శించారు ఆదివారం కాంగ్రెస్ మండల పార్టీ ఆద్వర్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం లో
ఆయన మాట్లాడుతూ
మాజి మంత్రి వర్యులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతూ ఆ సంస్థ ద్వారా నిర్వహించే సేవ కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీస్ శాఖతో కలిసి సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించడం ఏంటని మాత్రమే ప్రశ్నించారని తెలిపారు.
జీవన్ రెడ్డి మాట్లాడిన అనంతరం ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన కొంతమంది కోఆర్డినేటర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డి పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అట్టి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం గురించి,రాష్ట్ర ప్రజల సమస్యల గురించి వ్యవసాయ రంగం,విద్య,నీటిపారుదల మరియు ఇతరాత్ర అంశాలపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ఏకైన నాయకుడు జీవన్ రెడ్డి అని పేర్కొన్నారు.
మీడియా సమావేశంలో మైక్ ఉంది కదా అని ఎది పడితే అది మాట్లాడటం సరైంది కాదు అన్నారు.
జీవన్ రెడ్డి గారి లాంటి పెద్ద నాయకుల గురించి మాట్లాడితే మేము పెద్ద నాయకులమవుతాము అనుకోవడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని తెలిపారు.
గత రెండు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎంత మందికి ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు,ఎంత మందికి క్వారంటైన్ సెంట్లర్లు ఏర్పాటు చేశారో,ఏమేమి సేవ కార్యక్రమాలు చేశారో మా అందరికీ తెలుసు అని అన్నారు.
రాజకీయాలలో ఉండి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పరిధులకు లోబడి మాట్లాడాల్సి ఉంటుందని మరోసారి జీవన్ రెడ్డి గురించి మాట్లాడేటపుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్,జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్,మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేష్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీయొద్దిన్,టౌన్ బిసి సెల్ అధ్యక్షులు వొజ్జల లక్ష్మణ్,సీపతి సత్తెన్న,టౌన్ యూత్ అధ్యక్షులు అప్పం తిరుపతి, అశెట్టి శ్రీనివాస్,సుముక్,మల్లేశం,రాజ్ కుమార్,ప్రశాంత్, భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
.