తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, గోదావరి కళా సంఘాల సమాఖ్య సంయుక్త నిర్వహణలో "సింగరేణి కళా వైభవం-2023" సకల కళా మహోత్సవాలు గోదావరిఖని ఆర్సిఓఏ క్లబ్ లో మంగళవారం ప్రారంభమయ్యాయి.
పలువురు సీనియర్ కళాకారులు హాజరై జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ కళాకారుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతిఏటా సమాఖ్య వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు ప్రతి ఏటా భాషా సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోందన్నారు. ఈనాటి కార్యక్రమంలో శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలు, కోలాటం, యక్షగానాలు కళాకారులు ప్రదర్శించనున్నారని, రాత్రి జరిగే ముగింపు సమావేశంలో "సింగరేణి కళారత్న" పురస్కారాలతో పలువురు కళాకారులను సత్కరించనున్నామన్నారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
సంస్థ అధ్యక్షుడు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాదరి వాసు, ప్రజానాట్యమండలి కళాకారులు కే.స్వామి, సీనియర్ కళాకారులు దామెర శంకర్, దయా నర్సింగ్, మేజిక్ రాజా, సోగాల వెంకటి, బోడకుంట వెంకట్రాజం, ఈ.పద్మ, తీగల లక్ష్మీనారాయణ, గద్దల శశిభూషణ్, నాగుల శ్రీనివాస్, బీరుక లక్ష్మణ్, కుమార్ పటేల్, యూసుఫ్, అంజలి, మాధవి, సిరిపురం శ్రీనివాస్, జనగామ రాజనర్సు, మొండి, దేవా, ఎల్వి రావు తదితరులు పాల్గొన్నారు
.