కెమిస్ట్రీలో మొదటి ర్యాంకు సాధించిన సతీష్ : అభినందించిన టిబిజికేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి

తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): ఇటీవల సింగరేణిలో  జరిగినటువంటి జూనియర్ కెమిస్ట్ జూనియర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పరీక్షల్లో సింగరేణి వ్యాప్తంగా ప్రధానంగా సాధించిన ఆర్జీవన్ జీఎం ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెల్పూరి సతీష్ మొదటి ర్యాంకు సాధించడం పట్ల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి  ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మిరియాల రాజి రెడ్డి గారు  మాట్లాడుతూ సతీష్ విద్యార్థి సంఘాల నుంచి తెలంగాణ ఉద్యమంలో రామగుండం విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా క్రియాశీలకంగా గా పనిచేస్తూ గతంలో సింగరేణిలో 3200 మంది ఉద్యోగులకు కోసం పెండింగ్లో ఉన్న క్రమంలో అప్పుడు ఆ యొక్క సమస్యకు నాయకత్వం వహించి  శ్రీనాథ్, సతీష్ క్రియాశీలకంగా పని చేయడం ద్వారా వన్ టైం సెటిల్మెంట్ల ఉద్యోగాలు సాధించారని తద్వారా ఉద్యోగంలో చేరిన సతీష్ అంచలంచెలుగా ఎదుగుతూ ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయాల్లో తన చదువు తన చేసిన msc కెమిస్ట్రీ చదువుకు తగ్గట్టుగా 2022లో జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ గా మొదటి ర్యాంకు అదేవిధంగా నేడు కెమిస్ట్రీ గా మొదటి ర్యాంకు సాధించడం ఇంకా ఆనందంగా ఉందని తెలియజేశారు .

ఇదే స్ఫూర్తితో సింగరేణిలోని యువత అంతా వివిధ అర్హతలు ఉన్నవారు వారి అర్హతలకు తగ్గట్టుగా ఖాళీ సమయాల్లో చదువుతూ ప్రమోషన్లు పొందాలని తద్వారా కంపెనీలో ఉన్నత స్థానంలో ఉండాలని వారు కోరారు 

ఈ కార్యక్రమంలో నూనె కొమురయ్య గంట వెంకటరమణారెడ్డి వడ్డేపల్లి శంకర్ నాగలి సాంబయ్య  సంపత్ రెడ్డి శ్రీకాంతరావు జనగామ శ్రీనివాస్ రాజు శ్రీనివాస్ గంగుల సతీష్ ప్రవీణ్ చందు తదితరులు పాల్గొన్నారు

.