పోచమ్మ తల్లికి బోనం ఎత్తి మొక్కు సమర్పించిన ఎంపీపీ వుట్కురి వెంకట రమణ రెడ్డి

 తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట):ఇల్లంతకుంట మండలంలోని సోమారంపేట గ్రామం లో  రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి ల తో కలిసి ఆదివారం పోచమ్మ బోనాలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.  మహిళలు బోనం ఎత్తుకుని  ఊరేగింపు చేస్తు అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలం లో పంటపోలాలు బాగా సంవృద్దిగా పండాలని, మండల ప్రజలు  ఆరోగ్యంగా, సుభిక్షంగా అభివృద్ది  చెందాలని  గ్రామ దేవతను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు మరియు  గ్రామస్తులు పాల్గోన్నారు

.