పౌష్టికాహారంతోనే ఆరోగ్యం : ఎంపీపీ పడిగల మానస రాజు

మహిళలు పోషకాహార నియమాలను పాటించాలి

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి);మహిళలు పోషకాహార నియమాలను పాటించాలని,పౌష్టికాహారం తోనే ఆరోగ్యంగా ఉంటామని ఎంపీపీ పడిగెల మానస అన్నారు.విలేజ్ హెల్త్, శానిటేషన్, న్యూట్రిషన్ డే సందర్భంగా బుధవారం  తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ భవన్లో  సర్పంచ్ అంకారపు అనిత రవీందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభకు ఎంపీపీ హాజరై మాట్లాడుతూ...

మహిళలు పౌష్టికాహార నియమాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్  మహిళల ఆరోగ్యం పట్ల ఎన్నో కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులకు,బాలింతలకు,చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెల్త్,ఐసీడీఎస్ అధికారులు ఆరోగ్య, పౌష్టికాహార నియమాలపై సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్,జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, డాక్టర్ స్నేహ, ఎంపీడిఓ లచ్చాలు,అంగన్వాడి టీచర్స్, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు

.