తబిత ఆశ్రమంలో అన్నదానం..! చిన్నారుల మధ్య బర్త్ డే వేడుకలు

తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): :రామగుండంలోని తబిత అనాధాశ్రమంలో చిన్నారులకు మంగళవారం అన్నదానం నిర్వహించారు. కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు ఇజాజ్ ఖాన్-ఫిర్దోస్ ల రెండవ కూతురు తానియా రెండవ పుట్టిన రోజు వేడుకలను తాబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అనాధ చిన్నారుల మధ్య వేడుకలను సంతోషంగా జరిపారు. బర్త్ డే రోజున చిన్నారులకు అన్నదానం చేయడం పుణ్యకార్యమని తబిత అనాధ ఆశ్రమ నిర్వాహకులు వీరేశ్వర నాయక్ కొనియాడారు. వేడుకల పేరుతో డబ్బులు వృధా చేయకుండా, వృద్ధులకు, అనాధలకు ఖర్చు పెట్టాలని సూచించారు. అనాధాశ్రమానికి ప్రజలు కూడా చేయూతనివ్వాలని కోరారు. తబిత ఆశ్రమ చిన్నారుల మధ్య చిన్నారి తానియా కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాజిద్ ఖాన్ హానియాతోపాటు చిన్నారులు పాల్గొన్నారు.

.