సూపర్ బజార్ లో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి!
తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): సింగరేణి సూపర్ బజార్లు అనేవి కార్మికులు తమ కష్టార్జితంతో షేర్ క్యాపిటల్తో అన్ని ఏరియాల్లో నడుపబడుతున్నాయని, అందులో అన్ని రకాల సరుకులు కార్మికులకు అందుబాటులో వుండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యం వల్ల నేడు సూపర్ బజార్ లో నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా ఉండటం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సింగరేణి యాజమాన్యం వెంటనే సూపర్ బజార్ లో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వస్తువులు, సరుకులు, కోరిన వస్తువులు సరసమైన ధరలకు అందించాలనే సదుద్దేశం తో 1974 లో అప్పటి సి & యం. డి శ్రీ బి యన్ రామన్ గారు సింగరేణిలో సూపర్ బజార్ లను ప్రారంభించారని, యాజమాన్యం ఎలాంటి ఆర్థిక పెట్టుబడి పెట్టి నడపడం లేదని, కేవలం అధికారుల్ని వీటి మీద అజమాయిషీ కి అన్ని ఏరియాల్లో పెట్టిందని, వీరు పెత్తనం చేస్తున్నారు కానీ కంట్రోల్ లేదని ఆయన ఆరోపించారు, సూపర్ బజార్ లకు ఎన్నిక కాబడిన సభ్యులను వారి సలహాలను లెక్కచేయకుండా అంతా అధికారులే నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. సూపర్ బజార్ లలో పని చేస్తున్న ఆధికారుల అవినీతికి అంతులేకుండా పోయిందని ఆయన అన్నారు. డి.యం లు తమ ఇస్టారీతిగా వ్యవహరిస్తూ ఎన్నో సంవత్సరాలుగా సూపర్ బజార్ లలో పాతుక పోయారని వారి పై ఆజామాయిషి చేసే వారు కరువయ్యారని ఆయన అన్నారు. పద్దతి లేకుండా పై వారికి చెప్పకుండా కొనుగోలు చేస్తారని, తప్పు చేసినవారి మీద చర్యలు ఉండవని ఆయన అన్నారు. అదే గనుక కార్మికుడు ఏ చిన్నతప్పు చేసిన సస్పెండ్ లేదా డిస్మిస్ చేస్తారని. లక్షలు లక్షలు కౌంటర్ ల మీద సిబ్బంది తింటున్న డి .యం/ఎం.డి ల పర్యవేక్షణ ఉండదని. ఆడిట్ లో బయట పడినప్పుడే ఈ అవినీతి విషయాలు బయటకు వస్తాయని, వారిని. ప్రశ్నించేవాడే లేడని, శిక్షలే లేవని ఆయన ఆరోపించారు. ఇదో పెద్ద మాయాబజార్ అని, గోదావరిఖని సూపర్ బజార్ లో అధికారుల నిర్లక్ష్యం వల్ల సరుకులు అందుబాటులో లేకుండా పోయాయని ఆయన అన్నారు. ఈ విషయమై మే నెలలో కూడా ఏ ఐ టి యూ సీ ఆందోళన చేసిందని,కార్మికులు ఇక్కడ సరుకులు లేక బయటి దుకాణాలను ఆశ్రయిస్తున్నారని, కొన్ని సూపర్ బజార్ లలో సరుకులు బయటి బజార్ కు తరలించి అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విధంగా సరుకులు బయటకి తరలి పోతుంటే సరుకులు అందుబాటులో ఎలా ఉంటాయని, కార్మికులు ఏం కొనగలరని ఆయన ప్రశ్నించారు? ఏనాడైన ఈ సూపర్ బజార్ సొసైటీ లు కనీసం కార్మికులకు ఒక్క రూపాయి అయినా డివిడెండ్ రూపంగా ఇచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. అన్ని సొసైటీ లు ప్రతి సంవత్సరం డివిడెండ్ లు ఇస్తున్నాయి కదా! మరి సూపర్ బజార్లు లాభాలు వచ్చినా ఎందుకు డివిడెండ్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు? అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ లు పెట్టాలని అడిగినా ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. డివిడెండ్ ఇవ్వడం లేదని, ఇవి కార్మికుల కష్టార్జిత సొమ్మొతో నడుస్తున్నాయని ఆయన అన్నారు. యాజమాన్యం సూపర్ బజార్ ల మీద దృష్టి సారించి, అవినీతి అధికారుల పై చర్యలు తీసుకొని సూపర్ బజార్ లను ప్రక్షాళన చేయాలని, కార్మికులకు అన్ని వస్తువులు/సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని మడ్డి ఎల్లా గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు, లేనిచో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
