ఆగస్టు లో గుర్తింపు సంఘం ఎన్నికలు.
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల అగ్రిమెంట్ ను అమలు పై చర్యలు తీసుకుంటాం
డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో డైరెక్టర్ ఫా తో కార్మిక సంఘాల సమావేశం.
చర్చల వివరాలను వెల్లడించిన ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
తెలంగాణ ప్రభ,(పెద్దపల్లి): మంగళవారం హైదరాబాదులో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో డైరెక్టర్ ఫా తో గతంలో యూనియన్ లతో జరిగిన కాంట్రాక్టు కార్మికుల అగ్రిమెంట్ గురించి చర్చించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. డైరెక్టర్ ఫా గత అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు బోనస్ అమలు చేస్తామని, నర్సరీ కార్మికులకు కనీస వేతనం చెల్లించటం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు ఈ.ఎస్.ఐ హాస్పటల్లో మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించటానికి అమలు చేస్తామని అన్నారని ఆయన తెలిపారు.
సింగరేణి లో గుర్తింపు ఎన్నికల పై జూన్ 24న మళ్ళీ మీటింగ్ జరిపి ఆరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని, ఎన్నికలు ఆగస్టులో జరుపుతామని అంగీకరించారని ఆయన తెలిపారు. ఇట్టి సమావేశంలో ఏఐటియుసి నాయకులు శేషయ్య తో పాటు మిగతా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
