బదిలీలు, పదోన్నతుల కేసు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపి వేసవి సెలవుల్లో నిర్వహించాలి

 TRTF జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ 

తెలంగాణ ప్రభ (గంభీరావుపేట): నేడు గంభీరావుపేట మండల కేంద్రంలో టిఆర్టిఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు ముత్తయ్యగారి  నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిఆర్ టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ... 

ఉపాధ్యాయ బదిలీలు,

పదోన్నతులకు సంబంధించి కోర్టు కేసు పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపి, ఈ వేసవి సెలవుల్లో బదిలీలు పదోన్నతులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలో ఏళ్ల తరబడి గా బదిలీలు పదోన్నతులు లేకపోవడం, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యారంగం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. రెగ్యులర్ ఎంఈఓ లు, డిప్యూటీ ఈవోలు, డీఈవోలు లేక పాఠశాలల పరిస్థితి అగమ్య గోచరంగా మరిందన్నారు. ప్రాథమిక విద్య బలోపేతం కావాలంటే ప్రభుత్వం ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయున్ని, తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల పరిశుభ్రత కోసం ప్రతి పాఠశాలకు స్కావెంజర్ లను, అటెండర్ లను నియమించాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, మండల అధ్యక్షుడు ముత్తయ్య గారి నాగరాజు, ప్రధాన కార్యదర్శి శనిగరం మహేష్, జిల్లా కౌన్సిలర్లు, సిహెచ్ బాలకిషన్, శనిగరం రామచంద్రం, గంద్యాడపు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

.