మండల విద్యాధికారి కి వినతి పత్రం

తెలంగాణ ప్రభ (పెద్దపల్లి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేయాలని కోరుతూ మండల విద్యాధికారికి పిడిఎస్యు నాయకులు రామచంద్ర గురువారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేయాలని అనుమతి లేని పాఠశాలలను నోటీసులు జారీ చేసి సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఆయనను కోరడం జరిగింది.

కొన్ని ప్రైవేటు పాఠశాలలు పూర్తిస్థాయి అనుమతి లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో పాఠశాలల నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది.  పూర్తిస్థాయిలో తనిఖీ చేసి విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా చూడాలని చెప్పడం జరిగింది.

.