క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి : ఆర్.జి.1 ఏరియా జియం. చింతల శ్రీనివాస్.

ఆర్.జి 1 ఏరియా లో ఉచిత వేసవి శిక్షణ శిబిరము... ముగింపు కార్యక్రమంలో ఆర్.జి.1 ఏరియా జియం. చింతల శ్రీనివాస్....

తెలంగాణ ప్రభ, (పెద్దపల్లి): గత నెలరోజులుగా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (WPS&GA) ఆధ్వర్యంలో ఆర్.జి.1 ఏరియాలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, మాజీ ఉద్యోగుల పిల్లలకు , పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలకు స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో  నిర్వహించబడుతున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని" మంగళ వారం ఆర్ జి 1 ఏరియా జియం&వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స సోసియేషన్ అధ్యక్షులు చింతల శ్రీనివాస్  ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు టి షర్ట్, షార్ట్స్ ఔత్సాహిక క్రీడాకారులందరికి  అందజేశారు.

ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జియం గారు మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ శిభిరములో సెలవులలో బాల బాలికలకు ఒక నెల రోజుల పాటు క్రీడా అంశాల మీద శిక్షణ శిభిరం నిర్వహించడం ద్వారా వారిలో మానసిక పరిపక్వతకు ఎదుగుదలకు,  జీవితంలో సాదించాలనే తపన ఓక పట్టుదల పెరగడమే కాకుండా వివిధ క్రీడాంశాలలో ఆసక్తి కనబర్చి ప్రతి ఒక్కరిలో గెలుపొందలనే పోటీ తత్వం, తపన క్రమ శిక్షణ అలవర్చుతుందని తెలిపారు.  గతంలో వేసవి సెలవులలో వివిధ ఊర్లకు,  గ్రామాలకు వెళ్లడం అక్కడ కొత్త కొత్త విషయములు తెలుసుకోవడం సరదాగా గడపడం జరిగేదని కాని నేటి సమాజంలో ఇప్పుడున్న వాతవరణంలో సెల్ ఫోన్, టివిలు చూడటం వలన పిల్లలలో క్రీడాలపై ఆసక్తి తగ్గి మానసికంగా తమా విలువైన జీవితాన్ని ఎంతో కోల్పోతున్నరని కావున ఎదిగే పిల్లలు తమ సమయం కొంత క్రీడాలపై ఆసక్తి కనబర్చడం వలన అవి మన భావి భారత జీవితానికి బాటలు  వేయటకు ఎంతో దోహదపడగలవని తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఫుట్ బాల్, వాలి బాల్, అథ్లెటిక్, బాస్కెట్ బాల్, ఆర్చరీ, బాక్సింగ్, కరాటే తదితర క్రీడాంశాలములలో   శిక్షకుల చేత 150 మందికి శిక్షణ ఇప్పించడము జరిగినదని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో (WPS&GA) చీఫ్ కో ఆర్డినేటర్ & డీజీఎం పర్సనల్ సి హెచ్. లక్ష్మి నారాయణ గారు,  గుర్తింపు సంఘం అర్జీ.1 ఉపాధ్యక్షులు గండ్రా దామోదర్ రావు, సీఎంఓఐ ప్రెసిడెంట్ పోనగోటి శ్రీనివాస్, ఆర్జీ-1 ఏరియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి  బంగారు సారంగపాణి,  డిజియం క్వాలిటీ శ్రీధర్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేశ్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ సామల సత్యనారాయణ స్పోర్ట్స్ కోచ్ లు మొండయ్య, షబానా, ప్రశాంత్, సంపత్, శ్రీనివాస్, మరియు అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు

.