నియోజకవర్గ అభివృద్ధికి 10కోట్ల నిధులు మంజూరు : మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ ప్రభ(ధర్మపురి): ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఏఫ్ నిధుల ద్వారా పది కోట్ల నిధులు మంజూరు అయినట్లు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇట్టి నిధుల ద్వారా నియోజకవర్గం లోని గ్రామాల్లో వివిధ కులసంఘ భవనాలు, మంచి నీటి వసతులు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇట్టి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన సందర్భంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

.