రేణుకా మాత ఎల్లమ్మను దర్శించుకున్న ఆరేపల్లి మోహన్

 తెలంగాణ ప్రభ (ఇల్లంతకుంట): మండలంలోని కంధికట్కూర్ గ్రామంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలసిన  రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో బోనాలు, బండ్ల ప్రదక్షిణతో ఘనంగా జరుగుతుంది, గురువారం రోజున మానకొండూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ రేణుకా మాత ఎల్లమ్మను   దర్శించుకొని పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ  నియోజకవర్గం ప్రజలను ఏ కష్ట లు లేకుండా చూడాలని అమ్మవారి కి మొక్కలు చెల్లించ అని తెలిపాడు,ఈ కార్యక్రమం లో మాజి ఎంపిటిసి తిరుపతి, కిషన్ రావు, రజనికాంత్ గౌడ్,బూమయ్య,విజయ్, పర్శరాములు గౌడ్, సంతోష్ గౌడ్,మహేష్ యాదవ్, జాగిరి రమేష్ గౌడ్, అల్లాడి రఘు తదితరులు పాల్గొన్నారు

.